2 జనవరి, 2010

తెలంగాణా నిజానిజాలు

తెలుగు ప్రజలను గత నెల రోజులుగా కంగారు పెడుతున్న విషయం ప్రత్యెక రాష్ట్రము. బ్లాగు చదువుతున్న తెలుగు ప్రజలారా,మేధావులారా,విస్లెశకులారా మీరంతా నేను చెప్పుతున్న అభిప్రాయాన్ని జాగ్రత్తగా చదవండి.మరికొందరికి చదవమని సూచించండి. బ్లాగు చదువుతున్న ప్రతి ఒక్కరు సగటు మనిషగా చదవండి.తెలంగాణా ప్రాంతానికి అన్యాయం జరుగుతోంది విడిపోదాం అంటున్నారు అయితే విడిపోతే ముందుగ ఏం జరుగుతుందో ఆలోచించండి.
*ఎవరైతే తెలంగాణా కావాలని ఉద్యమాలు చేస్తున్నారో వారి దగ్గర తెలంగాణాను అభివృద్ది పరచటానికి ప్రణాళిక వుందా?(లేదు)
*శాంతి భద్రతలు సుస్తిరప్రభుత్వాలు వీలవుతాయా?(కాదు)
*పదేళ్ళక్రితం౩ రాష్ట్రాలు ఏర్పడితే అందులో ఏ ఒక్క రాష్ట్ర ప్రజానీకం అయినా కలసివున్నప్పటికంటే సంతోషంగా వున్నారా ?(లేరు)
*నిన్న బీహార్ నుంచి విడిపోయిన ఒక చిన్న రాష్ట్రం తొమ్మిది సంవత్సరాలు గడిచే సరికి ఏడుగురు ముఖ్యమంత్రులు మారారు ఒకసారి రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్ర చరిత్ర తీసుకొంటే అక్కడి నాయకులకన్నా ప్రజలే రాష్ట్రాన్ని కోరి తెచ్చుకున్నారు. రాష్ట్రంలో దేశం మొత్తంలోని ఇనుప ఖనిజంలో మూడు వంతులు అక్కడే వుంది. మరి అక్కడ జరుగుతున్న అబ్భివ్రుద్ధి?(సున్నా)

అన్ని ప్రశ్నలకు సమాధానం వుంటే ప్రత్యెక రాష్ట్రం కోసం శ్రమించండి. రాష్ట్రాన్ని ముక్కలు చేయడం జరిగితే అది చరిత్రలో సరిదిద్దుకోలేని తప్పు అవుతుంది తెలుగు ప్రజలకు. భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ పటాన్ని చూసారా ఎంత అందంగా వుంటుంది. నేను ఎప్పుడూ అనుకుంటూ వుంటాను మొత్తం ప్రపంచంలోని ఖండాలన్నిటికి చిన్న రూపం ఇస్తే అది భారతదేశం,అలాగే మొత్తం భారతావనికి చిన్న రూపం ఇస్తే అది ఆంధ్రప్రదేశ్ అవుతుంది.అలాంటి రాష్ట్రాన్ని ఎందుకు ముక్కలు చేయాలని భావిస్తున్నారు? అలా చేస్తే తెలుగు ప్రజల గతి ఏమిటి? తెలుగు ప్రజలకు బయట ప్రపంచంలో మర్యాద దక్కుతుందా?

తెలంగాణాను విభాజించాలంటే ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి. అందుకోసం సార్వత్రిక ఎన్నికలలాగా ఎన్నికలు జరపాలి. తెలంగాణా కావాలి,వద్దు అనుటకు రెండు గుర్తులు కేటాయించి ప్రజల్లో యనభయ్ శాతం (నమోదైన వాటిలో) కోరితే తెలంగాణా ఇవ్వాలి లేకపోతె వద్దు. ఐతే హైదరాబాద్ అనేది తెలంగాణా లో భాగం కావున తెలంగాణా వారికే ఇవ్వాలి కాకపొతే ఆంధ్రప్రదేశ్ కు చెందిన లక్షా పది వేల కోట్ల ఋణం కూడా వారికే ఇవ్వాలి.

ఇక హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒకరోజు నేను ఒకరితో మాట్లాడుతూ వుంటే రాష్ట్రం విడిపోయినా హైదరాబాద్ ఎక్కడ వున్నా సమస్య లేదు అన్నాడు. నేను దానికి సమాధానంగా "హైదరాబాద్ సగానికి సగం ఖాళి అవుతుంది ఎందుకంటే నన్నే తీసుకొంటే మా ఊరికి హైదరాబాద్ కన్నా చెన్నయ్ దగ్గర కాని హైదరాబాద్ లో ఎందుకు ఉంటున్నాం? ఇది మన రాష్ట్రం, మన రాజధాని అనే ఉద్దేశంతో ఒకవేళ విడిపోతే ఇది మన రాజధాని కానప్పుడు ఇక్కడ ఎందుకు వుండాలి?" ఇలాంటి భావనలతోనే స్వాతంత్ర్యం వచ్చినపుడు పాకిస్తాన్ విడిపోతే భారతదేశానికి జనం ట్రైన్ లలో ఎలా తరలి వచ్చారో అందరికి తెలిసిందే. కావున ప్రజలు విషయాలన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

రాష్ట్రాన్ని విడగోట్టాల్సి వస్తే మూడు భాగాలుగా చేయాలి.మాకు కర్నూలు రాజధానిగా కడప,చిత్తూరు,కర్నూలు,అనంతపురం,నెల్లూరు,ప్రకాశం కలిపి రాయలసీమ ఏర్పాటు చేయాలి. కాని రెండు జిల్లాల ప్రజల ప్రజా అభిప్రాయాన్ని తీసుకొని వారు ఎక్కడ కలవాలనుకొంటున్నారో అందుకు తగిన విధంగా చేయాలి. ఒకవేళ వారు మా ప్రాంతంలో కలిస్తే రాజధాని కర్నూలులో కేవలం అసెంబ్లీ, హైకోర్టు మాత్రమే వుంటాయి. మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒక్కో జిల్లలో ఒక్కోటి అనగా రాయలసీమ రాష్ట్ర ఎస్.ఎస్.సి బోర్డు ప్రకాశం లోనూ, ఇంటర్ బోర్డు నెల్లూరు లోను, పబ్లిక్ సర్వీసు కమీషన్ కడప లోను విధంగా అన్ని జిల్లాలలో సమానంగా ఏర్పాటు చేయాలి.

రెండువేల పన్నెండులో ప్రజాభిప్రాయం కోసం తెలంగాణా అభిప్రాయ ఎన్నికలు జరపాలి. మిగిలినవన్నీ కూడా రెండువేల పద్నాలుగులోపు పూర్తి చేసి సాధారణ ఎన్నికలు ప్రత్యేక రాష్ట్రాలకు జరపాలి.

ఇక ప్రజలు విభజన కోరకపోతే తెలంగాణా అంశాన్ని రాజకీయ నాయకులు మాట్లాడద్దు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరే పార్టీల గుర్తింపు రద్దు చేయాలి. ఇక ఉమ్మడి పాలనలో వుంటే తెలంగాణా అభివృద్ధి మాత్రమే కాక వెనుకబడిన అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం శాసన మండలి రద్దు చేసి దాని స్థానంలో వెనుకబడ్డ ప్రాంత అభివృద్ధి మండలి ఏర్పాటు చేసి అందులో ప్రాంతాల ఎమ్మెల్యే, ఎంపి,మంత్రులతో కలసి వాటి అభివృద్ధికి కృషి చేయాలి.